మందమరిలోఘనంగా రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు




 

మందమరిలోఘనంగా రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు

మందమర్రి:జూన్ 19/06/2026(నేటి ఇజం దినపత్రిక)

భావి భారత ఆశాదీపం, ప్రజా నాయకులు రాహు మందమర్రి:జూన్ 19/06/2026(నేటి ఇజం దినపత్రిక) ల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మందమర్రి పట్టణంలోని మనోవికాస్ పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మంద తిరుమల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసిసి అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారు పాల్గొని విద్యార్థులతో కలిసి కేకు కట్ చేసి, విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు మరియు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు  అనంతరం మంద తిరుమలరెడ్డి మాట్లాడుతూ

రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నూతనోత్సాహం కలిగించారని, తెలంగాణలో అధికారం చేపట్టడంలో భారత్ జోడో యాత్ర కీలక పాత్ర పోషించిందని తెలిపారు

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓట్ చోరీతో అధికారం చేపడుతూ, రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని, ఓట్ చోరీతో పాటు సీట్ చోరీకి పాల్పడుతూ ప్రతిపక్షాలను అణిచివేసే కుట్రలు చేస్తున్నారని తెలిపారు

 ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేసి ED, CBI పేరుతో నాయకులను బెదిరింపులకు గురి చేసి పార్టీలను కూడా చోరీ చేస్తున్నారని తెలిపారు 

ఈ దేశానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వం అవసరమని, వారు ప్రధాని పదవి చేపట్టేవరకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు

      ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా మరియు పట్టణ కమిటీ నాయకులు, యూత్, మహిళా, మైనారిటీ, సేవాదళ్ మరియు అనుబంధ సంఘాల నాయకులు, సోషల్ మీడియా వారియర్స్, బూత్ ఇంఛార్జ్ లు పాల్గొన్నారు.komuraiahramadugu12@gmail.com

Post a Comment

0 Comments