రామగుండం పోలీస్ కమీషనరేట్
ఇందారం క్రాస్ రోడ్డు వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
145 గ్రాముల గంజాయి, సెల్‌ఫోన్ స్వాధీనం
నమ్మదగిన సమాచారం మేరకు ఇందారం క్రాస్ రోడ్డు వద్ద గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి ని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి గంజాయి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
జైపూర్:తేది :14-06-2026:(నేటి ఇజం)
శనివారం మధ్యాహ్నం అందిన నమ్మదగిన సమాచారం మేరకు జైపూర్ సీఐ నవీన్ గారి ఆదేశాల మేరకు జైపూర్ ఎస్ ఐ భూమేష్ సిబ్బంది తో ఇందారం క్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించారు. పోలీసులను గమనించిన ఓ వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా అనుమానం వచ్చి అతడిని అదుపులోకి తీసుకుని విచారించగ విచారణలో అతను *షేక్ ఆఫ్రీద్ (23), ఎస్.టి కాలనీ, జైపూర్* వాసిగా గుర్తించారు. నిందితుడు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నానని, ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి జైపూర్ మరియు పరిసర ప్రాంతాల్లో అధిక ధరకు విక్రయిస్తున్నానని ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద ఉన్న బ్యాగును పంచుల సమక్షంలో తనిఖీ చేయగా, ఒక ప్యాకెట్‌లో డ్రై గంజాయి లభించింది. తూకం వేయగా 145 గ్రాముల గంజాయి ఉన్నట్లు నిర్ధారణ అయింది. అలాగే గంజాయి కొనుగోలు, విక్రయాలకు ఉపయోగిస్తున్నట్లు తెలిపిన రియల్‌మీ 6 ప్రో మొబైల్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.3,500 అంచనా వేశారు. గంజాయి ప్యాకెట్, పాలిథీన్ కవర్, మొబైల్ ఫోన్‌లను సీజ్ చేయడం జరిగింది. అనంతరం నిందితుడిని, స్వాధీనం చేసుకున్న ఆస్తులను పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
నిందితున్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై, సిబ్బందిని ఏసీపీ గారు అభినందించారు.komuraiahramadugu12@gmail.com
komuraiahramadugu12@gmail.com
రామడుగు కొమురయ్య ఎడిటర్
నేటి ఇజం దినపత్రిక


0 Comments