బడుల మూత పై సీఎం చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి.
4 వేల స్కూల్ చాలు అని సీఎం అనడం రాజ్యాంగ విరుద్ధం.
విద్య కై 20 శాతం నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయాలి.పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి.
నిజామాబాద్: జూన్ 14/06/2026:(నేటి ఇజం))
రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలు అవసరం లేదని, వాటిని నాలుగువేల పాఠశాలకు తగ్గిస్తామంటూ రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలు అవసరం లేదని, వాటిని నాలుగువేల పాఠశాలకు తగ్గిస్తామంటూ ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని, విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకమని మరియు అప్రజాస్వామికం అని పిఆర్టియు తెలంగాణ భావిస్తుంది. అందరికీ విద్యా వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కానీ వ్యాపారమయం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. రాష్ట్రంలో 11 వేల ప్రవేట్ పాఠశాలలో 66% మంది విద్యార్థులు చదువుతుంటే మరి 27 వేల ప్రభుత్వ పాఠశాలలో 34% విద్యార్థులు చదువుతున్నారు అంటే దీనికి కారణము ప్రభుత్వ బడులకు నిధులు కేటాయించకుండా, మౌలిక వసతులు కల్పించకుండా నిర్వీర్యం చేయడమే. విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమవుతుంది కాబట్టి బడుల మూసివేత పై ముఖ్యమంత్రి గారు పునారాలోచన చేయాలని, విద్యకు 20% నిధులు కేటాయిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ విద్య రంగాన్ని కాపాడాలని పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. అల్పాహారం పథకం మంచి నిర్ణయమని తెలిపారు. ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని, విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకమని మరియు అప్రజాస్వామికం అని పిఆర్టియు తెలంగాణ భావిస్తుంది. అందరికీ విద్యా వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కానీ వ్యాపారమయం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. రాష్ట్రంలో 11 వేల ప్రవేట్ పాఠశాలలో 66% మంది విద్యార్థులు చదువుతుంటే మరి 27 వేల ప్రభుత్వ పాఠశాలలో 34% విద్యార్థులు చదువుతున్నారు అంటే దీనికి కారణము ప్రభుత్వ బడులకు నిధులు కేటాయించకుండా, మౌలిక వసతులు కల్పించకుండా నిర్వీర్యం చేయడమే. విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమవుతుంది కాబట్టి బడుల మూసివేత పై ముఖ్యమంత్రి గారు పునారాలోచన చేయాలని, విద్యకు 20% నిధులు కేటాయిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ విద్య రంగాన్ని కాపాడాలని పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. అల్పాహారం పథకం మంచి నిర్ణయమని తెలిపారు.

0 Comments