సంగారెడ్డి ఏసీబీ వలకు చిక్కిన విద్యుత్ అడిషనల్ ఏఈ
సంగారెడ్డి:జూన్ 19/06/2026:(నేటి ఇజం దినపత్రిక)
అదనపు ఏఈగా పనిచేస్తున్న బి. రామకృష్ణారెడ్డి లంచం తీసుకుంటూ గురువారం మధ్యాహ్నం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
కారుతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో తనపై చర్యలు తీసుకోవద్దని కోరిన బాధితుడి నుంచి రూ.25 వేలు లంచం డిమాండ్ చేశారు.
బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
అతనిపై కేసు నమోదు చేసి హైదరాబాద్ కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
https://netiejam.blogspot.com/2026/06/blog-post_603.html?m=1

0 Comments