నూతన దంపతులను ఆశీర్వదించిన డా. దుర్గం నగేష్
మంచిర్యాల: జూన్ 12/06/2026:(నేటి ఇజం దినపత్రిక)
మంచిర్యాల జిల్లా ఊరు శ్రీరాంపూర్‌కు చెందిన కామెర రాజం లక్ష్మీ (లేట్) దంపతుల కుమారుడు విజయ్ సుజాతల వివాహ వేడుకలు శుక్రవారం బొక్కలగుట్ట గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సమత సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సమత ఫౌండేషన్ చైర్మన్ డా.దుర్గం నగేష్ తమ సభ్యుడు రామ టెంకీ విశ్వనాథ ప్రతాప్ తో కలిసి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డా. దుర్గం నగేష్ మాట్లాడుతూ.. నూతన దంపతుల దాంపత్య జీవితం ఆనందమయంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. పరస్పర ప్రేమాభిమానాలు, అవగాహనతో కుటుంబ విలువలను కాపాడుకుంటూ సమాజానికి ఆదర్శప్రాయమైన దంపతులుగా ఎదగాలని సూచించారు.వివాహం అనేది రెండు మనసులను, రెండు కుటుంబాలను కలిపే పవిత్ర బంధమని పేర్కొన్న ఆయన.. జీవితంలోని ప్రతి సందర్భంలో ఒకరికొకరు అండగా నిలుస్తూ ముందుకు సాగాలని నూతన వధూవరులకు సూచించారు.
ఈ వివాహ వేడుకల్లో పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

0 Comments