*బ్రేకింగ్ న్యూస్*
రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం మిషన్ భగీరథ ఆపరేటర్ మాచినేని రమేష్ మృతి
రామగుండం: జూన్ 21/06/2026:(నేటి ఇజం దినపత్రిక)
పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణం రామగుండం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రామగుండానికి చెందిన మాచినేని రమేష్ (32) అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు.స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామగుండం నివాసి అయిన మాచినేని రమేష్ అంతర్గాం మండలం ముర్ముర్ వద్ద గల మిషన్ భగీరథ పంప్ హౌస్‌లో ఆపరేటర్‌గా విధి నిర్వహణలో ఉన్నాడు. ఎప్పటిలాగే తన డ్యూటీ ముగించుకుని మోటార్ సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో, రామగుండం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపైకి రాగానే వెనుక నుండి అతివేగంగా వచ్చిన ఒక ట్రాన్స్‌పోర్ట్ బొలెరో వాహనం రమేష్ బైక్‌ను బలంగా ఢీ కొట్టడంతోఈ ప్రమాదంలో రమేష్ తలకు, చేతికి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 అత్యవసర వాహనంలో అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి రమేష్ మృతి చెందాడు.సమాచారం అందుకున్న రామగుండం సబ్ ఇన్‌స్పెక్టర్ సంధ్యారాణి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనాన్ని, డ్రైవర్‌ను పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించి ధర్యాప్తు చేస్తున్నారు.


0 Comments