మత్తు రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలి: పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డిపెద్ద పల్లి:జూన్11/06/2026:(నేటి ఇజం)
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు నేడు పెద్దపల్లి పట్టణంలోని చందపల్లి దర్గా ప్రాంగణంలో ఈగల్ ఫోర్స్,అటవీ శాఖ మరియు పోలీసు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం,మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డీసీపీ శ్రీ బి. రామ్ రెడ్డి,ఏసీపీ శ్రీ జి. కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.మత్తు పదార్థాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం,కుటుంబ వ్యవస్థ,సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయని వారు వివరించారు.యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని, సమాజ అభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.మత్తు రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో భాగంగా చందపల్లి దర్గా ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ నరేష్,ఈగల్ ఫోర్స్ సిబ్బంది,అటవీ శాఖ అధికారులు,సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు,స్థానిక పెద్దలు,గంజాయి వినియోగదారులు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

0 Comments