భూమి పేరుమార్పు పేరుతో మోసం
సీపీఐ నేతపై భూకబ్జా ఆరోపణలు
ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబం
పెద్దపల్లి:జూన్ 15:(నేటి ఇజం దినపత్రిక)
పెద్దపల్లి పట్టణంలోని ఉదయ్‌నగర్‌కు చెందిన పెర్క పెద్దపల్లి:జూన్ 15:(నేటి ఇజం దినపత్రిక) శ్రవణ్‌కుమార్ కుటుంబం తమ వ్యవసాయ భూమిని అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. బాధితుల కథనం ప్రకారం, పెద్దపల్లి పరిధిలోని రంగంపల్లి శివారులో సర్వే నంబర్లు 66/2, 66/3, 67లలో మొత్తం 1.28 ఎకరాల వ్యవసాయ భూమిని తమ తాత పెర్క హనుమయ్య 1983లో కీర్తి రాములు, కీర్తి మల్లయ్య, జనగామ పోషాల నుంచి కొనుగోలు చేశారని తెలిపారు. అప్పటి నుంచి తామే ఆ భూమిని సాగు చేసుకుంటూ కాస్తులో ఉన్నామని, దీనికి సంబంధించిన అన్ని లింక్ డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. అయితే సర్వే నంబర్ 66/2లోని 16 గుంటల భూమి అకారణంగా పెర్క రాములు, పెర్క నర్సయ్య పేర్లపైకి మారిందని తెలిపారు. ఈ విషయమై తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న సమయంలో తాండ్ర సదానందం అనే వ్యక్తి తమ భూమిని తిరిగి తమ పేరుపైకి తెప్పిస్తానని నమ్మబలికి, తమ తాతతో తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నాడని ఆరోపించారు. అనంతరం భూమిని తమ పేరుపైకి మార్చకపోగా, అందులో 8 గుంటలను తన పేరు మీదకు, మరో 8 గుంటలను పెర్క నర్సయ్య పేరు మీదకు పట్టా చేయించుకున్నాడని ఆరోపించారు. ఈ విషయమై ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతూ, తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని వాపోయారు. అలాగే రెండు గుంటలు, మూడు గుంటలు ఇస్తామని రాజీ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు భాదితులు వాపోయారు. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న తాండ్ర సదానందంపై తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే సీపీఐ పార్టీ నాయకత్వం ఆయనను సస్పెండ్ చేయడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి పదవులు ఇవ్వవద్దని కోరారు.ఈ కార్యక్రమంలో పెర్క శ్రవణ్‌కుమార్, పెర్క రాజేశం, పెర్క లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.komuraiahramadugu12@gmail.com
komuraiahramadugu12@gmail.com
రామడుగు కొమురయ్య ఎడిటర్
నేటి ఇజం దినపత్రిక


0 Comments