ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వార్డు సభ
మంచిర్యాల: జూన్ 6/2026:(నేటి ఇజం)
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా ఈ రోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ని 18 వ డివిజన్ లో ఏర్పాటు చేసిన వార్డు సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ * దర్ని మధుకర్ * గారు హాజరై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందచేయాలనే సదుద్దేశ్యం తో చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ ఏర్పాటు చేసిన వార్డు సభలో ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల కొరకు అధికారులను అందుబాటులో ఉంచడం జరిగిందని, డివిజన్ లో అర్హులైన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని,అదేవిధంగా డివిజన లో ఏదైనా పారిశుధ్య,నీటి సరఫరా,రోడ్ల మరమ్మతులు,విద్యుత్ దీపాల సమస్యలు,శాంతి భద్రతల సమస్యలు ఉన్నట్లయితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలియచేశారు.
కార్పొరేషన్ అభివృద్ధి కొరకు గౌరవ మంచిర్యాల శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో అబివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ,రానున్న రోజుల్లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందుండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాసమల్ల కమల శ్రీనివాస్ గౌడ్ గార్లు,CI గోపతి రవీందర్ గారు,హౌసింగ్ బోర్డు అధికారులు, డివిజన్ ఆఫీసర్స్ , మున్సిపల్ AE మధు గారు ,మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.




0 Comments