జిల్లా వాసులు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం అభినందనీయం
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల:జూన్7,2026:(నేటి ఇజం)
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో మే 29న జరిగిన హల్లెల్ మ్యూజిక్ స్కూల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వాసులు రికార్డు సాధించడం అభినందనీయమని తెలిపారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో రికార్డు సాధించిన బొడ్డు కవిత, బొడ్డు అన్విత ఏంజిల్ లను అభినందించారు. 22 దేశాల నుండి 2 వేలమంది కీబోర్డ్ వాయిద్య కారులు పాల్గొన్న గిన్నిస్ అచీవర్స్ మీట్ లో ప్రతిభ కనబరిచిన 777 మంది విద్యార్థులు ఎంపికయ్యారని, వీరిలో జిల్లాకు చెందిన తల్లి, కూతుర్లు ఎంపిక కావడం అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బొడ్డు రాజలింగు, తదితరులు పాల్గొన్నారు.

0 Comments