దొంగతనంకుసంబంధించిస్పాట్FIRనమోదుమరియు24 గంటలలోపేదొంగనుపట్టుకున్నచెన్నూర్ పోలీసులు

దొంగతనంకుసంబంధించిస్పాట్FIRనమోదుమరియు24 గంటలలోపేదొంగనుపట్టుకున్నచెన్నూర్ పోలీసులు

చెన్నూరు:21/04/2026:( నేటి ఇజం)

 పెద్దపల్లి కి చెందిన పెద్ది వెంకటేష్ అను వ్యక్తి నిన్న మహారాష్ట్ర ఆసరెల్లి లోని తన భూమి కౌలుకు సంబందించిన డబ్బులు లక్ష రూపాయలను కౌలుదారు వద్ద తీసుకొని ఈరోజు ఉదయం ఆసరెల్లి నుండి బయలుదేరి చెన్నూర్ కు వచ్చి మధ్యాహ్నం 12-30 గంటల సమయంలో చెన్నూర్ నుండి పెద్దపల్లి వెళ్ళుటకు కు బస్సు ఎక్కుచున్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన ఫ్యాంట్ జేబులోనుండి లక్ష రూపాయలను దొంగిలించినరాని చెన్నూర్ పోలీస్ వారికి సమాచారం తెలియడంతో చెన్నూర్ పట్టణ సీఐ తన సిబ్బంది సాయి ప్రశాంత్, ఖదీర్ మరియు సురేష్ లతో కలసి చెన్నూర్ బస్ స్టాండ్ కు చేరుకొని బాధితునితో మాట్లాడి అక్కడే అతనివద్ద నుండి పిర్యాదు తీసుకొని అక్కడికక్కడే స్పాట్ FIR నమోదు చేసి తన సిబ్బంది సహాయంతో బస్ స్టాండ్ పరిసరాలను పరిశీలించి బస్ స్టాండ్ సమీపంలోని మరియు వెలుపల రోడ్డు పై వున్న సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానితుల కదలికలపై నిఘా పెట్టి పిర్యాది లక్ష రూపాయలను దొంగిలించిన మందమర్రి కి చెందిన డొక్క అంజి అనే వ్యక్తిని 24 గంటలలోపు పట్టుకొని అతని వద్దనుండి అతను దొంగలించిన లక్ష రూపాయలను స్వాధీన పర్చుకొని  పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించనైనది. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సురేష్ మరియు ఖదీర్ ను పట్టణ సీఐ అభినందించినారు. అనుమానితుల మాటలు నమ్మి ఎవరు మోసపోవద్దని, ప్రయాణం చేసేటప్పుడు తమ విలువైన వస్తువులు నగదు గూర్చి జాగ్రత్త వహించాలని, అనుమానితులు ఎవరైనా తారస పడితే వెంటనే డయల్ 100 కు గాని లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని పట్టణ సీఐ బన్సీలాల్ సూచించారు.komuraiahramadugu12@gmail.com

నేటి ఇజం ఎడిటర్

komuraiahramadugu12@gmail.com

 

Post a Comment

0 Comments