మైనర్ బాలికలను ఎవరైనా ప్రేమ పెళ్లి పేరిట వెంటబడిన వారిని లైంగికంగా వేధింపులకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే గాక రౌడీ షీట్ కూడా తెరుస్తామని చెన్నూర్ పట్టణ సీఐ హెచ్చరించారు.


మైనర్ బాలికలను ఎవరైనా ప్రేమ పెళ్లి పేరిట వెంటబడిన వారిని లైంగికంగా వేధింపులకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే గాక రౌడీ షీట్ కూడా తెరుస్తామని చెన్నూర్ పట్టణ సీఐ హెచ్చరించారు.

చెన్నూరు: 21/04/2026:(నేటి ఇజం)

15 సంవత్సరాల మైనర్ బాలికను ప్రేమిస్తున్నాను అని వెంటబడి నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే గాక మైనర్ బాలికను వివాహం చేసుకొని ఆమెను మానసికంగా శారీరకంగా వేధించి ఇంటినుండి గెంటవేసిన  కిష్టంపేట కు చెందిన స్వామి అనే యువకుడి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఆరెస్ట్ చేసి రిమాండుకు తరలించిన చెన్నూర్ పట్టణ సీఐ. గత సంవంత్సరం అక్టోబర్ నెలలో కిష్టంపేట కు చెందిన స్వామి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన 15 సంవత్సరాల మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని వెంటపడి పెళ్లిచేసుకుంటానని నమ్మించి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి ఆ తరువాత ఆ మైనర్ అమ్మాయిని ఆమె కుటుంభికుల నిర్ణయానికి వ్యతిరేకంగా వివాహం చేసుకొని ఇంటికి తీసుకొనివెళ్లి ఆమెను కొద్ది కాలానికే మానసికంగా శారీరకంగా వేధింపులకు గురిచేసి ఇంటి నుండి గెంటివేయడమే గాక గత 6 నెలలుగా ఆమెను స్వామి మరల లైంగిక వేధింపులకు గురిచేయడంతో మైనర్ బాలిక తన తల్లితండ్రుల సహాయంతో చెన్నూర్ పట్టణ పోలీస్ స్టేషన్ లో నిన్న పిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అనంతరం మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన మరియు వివాహం చేసుకుని వేధింపులకు గురిచేసిన స్వామి అనే యువకుడిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన చెన్నూర్ పట్టణ సీఐ. మైనర్ బాలికలను ఎవరైనా ప్రేమ పెళ్లి పేరిట వెంటబడిన వారిని లైంగికంగా వేధింపులకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే గాక రౌడీ షీట్ కూడా తెరుస్తామని చెన్నూర్ పట్టణ సీఐ హెచ్చరించారు.komuraiahramadugu12@gmail.com

komuraiahramadugu12@gmail.com

నేటి ఇజం: ఎడిటర్ రామడుగు కొమురయ్య

Post a Comment

0 Comments