శ్రీరాంపూర్ జి.ఎం. ఆఫీస్ ముందు సులభ్ కార్మికుల ధర్నా G.M గారికి మెమోరం
ప్రతి నెల 10 వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలి
నేటి ఇజం: శ్రీరాంపూర్ :13/03/2026
సింగరేణి సులబ్ వర్కర్స్ యూనియన్ ( IFTU) ఆధ్వర్యంలో సులభ్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా *డి బ్రహ్మానందం ( ఐ ఎఫ్ టి యు) సింగరేణి సులభ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్* మాట్లాడుతూ సింగరేణిలో పనిచేసే సులబ్ కార్మికులకు సింగరేణి యాజమాన్యం ప్రతినెల 10.వ తేదీ లోపల వేతనాలు చెల్లించడం లేదు కార్పొరేట్ గైడ్లైన్స్ ఉన్నప్పటికీ వేతనాలు ఆలస్యం అవుతున్నాయి. అలాగే ఈ కార్మికులకు ఈఎస్ఐ - ఈపీఎఫ్ బోనస్, గత సంవత్సరం కాలంలో పెండింగ్లో ఉన్న డి.ఏ. విడుదల చేయలేదు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా వేతనాలు చెల్లించడం లేదు, ఇన్సూరెన్స్ సౌకర్యం అమలు చేయడంలో సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ సంస్థ వైఫల్యం చెందింది. సింగరేణి సులభ్ వర్కర్స్ యూనియన్(ఐ ఎఫ్ టి యు) ఆధ్వర్యంలో అనేకసార్లు సింగరేణి అధికారులకు మెమోరండాలు ఇచ్చినప్పటికీ, ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ సింగరేణి యాజమాన్యం కూడా పట్టించుకోవడం లేదు. అంతిమంగా హాస్పిటల్ సౌకర్యం లేక సులభ్ కార్మికులు నిత్యం వాడే కెమికల్స్, పెనయిల్, బ్లీచింగ్ పౌడర్, యాసిడ్ వల్ల కార్మికులు అనారోగ్యానికి గురై చనిపోతున్నారు. కనుక ఈ కార్మికులకు హాస్పటల్ సౌకర్యంతో పాటు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా
చెల్లించాలని అన్నారు. అలాగే చట్టం ప్రకారం రావలసిన బోనస్, అమలు చేయడం లేదు. అలాగే సులభ్ కాంప్లెక్స్ లు శిథిలావస్థకు చేరుకున్న రిపేర్ చేయడం లేదు. సులభ్ కాంప్లెక్స్ లు క్లీన్ చేయడం కోసం సులబ్ ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ సంస్థ నాణ్యమైన మెటీరియల్ ఇవ్వడం లేదు. ఈ రకంగా సులభ్ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం సులభ్ కార్మికుల సమస్యలను పరిష్కరించి చట్టబద్ధమైన హక్కులు అమలు చేయాలని సింగరేణి సులభ్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టి యు) డిమాండ్ చేస్తూ జి.ఎం వారికి మెమోరండం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ( IFTU) జిల్లా నాయకులు శంకరి. సత్యం, సులబ్ వర్కర్స్ యూనియన్ (IFTU) నాయకులు మంతెన లక్ష్మయ్య, నేదురి. నరసయ్య, మంతెన లక్ష్మయ్య, రాజేందర్, పరశురాములు, పంగ విజయ, రౌతు లక్ష్మి, మంత్రి జ్యోతి, సుగుణ, తదితరులు పాల్గొన్నారు.

komuraiahramadugu12@gmail.com


0 Comments