కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సింగరేణి లో ఆందోళనలకు సిద్దం కండి. కార్మిక వర్గానికి రాజ్ కుమార్ పిలుపు.



 కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 

సింగరేణి లో ఆందోళనలకు సిద్దం కండి.

కార్మిక వర్గానికి రాజ్ కుమార్ పిలుపు.

గోదావరిఖని: నేటి ఇజం:12/03/2026

సింగరేణి లో కార్మికుల సమస్యలను పరిష్కరించడం లో యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందినందున గుర్తింపు సంఘం ఏఐటియుసి ఆందోళన కార్యక్రమాలకు పిలుపు నిచ్చిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. సింగరేణి లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాలు గడిచినా యాజమాన్యం కొన్ని సమస్యల ను స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో అంగీకరించి ఇంత వరకు వాటిపై అమలు కోసం యాజమాన్యం సర్క్యులర్ లు జారీ చేయలేదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మారుపేర్లు విజిలెన్స్ కేసుల సమస్య, సొంత ఇంటి పథకం, పెర్క్స్ పై ఇన్ కం టాక్స్ సమస్య, డిస్మిస్ కార్మికుల కు ఒక అవకాశం కల్పించాలని కోరడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తుందని కనుక ఏఐటియుసి ఈ నెల 17 నుండి 30 వరకు సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపు నివ్వడం జరిగిందని, కనుక జయప్రదం చేయాలని ఆయన కోరారు.



Post a Comment

0 Comments