మ్యాట్రిమోనీ వలకు యువకుడు బలి..
ప్రేమ పేరుతో మోసం..
30 లక్షల వరకు స్వాహా:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: నేటి ఇజం: 11/03/2026
మ్యాట్రి మనీ లొ పరిచయం ప్రేమగా మారి ఓ అమాయకుడు బలియ్యడు. పెళ్ళి చేసుకుందాం మనం కలిసి ఉందామని నమ్మించి ఓ యువతి అమయకున్ని మోసం చేసింది రోజు రోజుకు ఆన్ లైన్ మోసాలు కొట్టరీతిలో అవతరిస్తూ అమాయక ప్రజలను మీసం చేస్తున్న, పోలీస్లు ఆన్ లైన్ మోసలకు బలి కావద్దు అంటూ ప్రచారం చేస్తున్న అమాయక ప్రజలు ఎదో విదంగా మోస పోతూనే ఉన్నారు... అన్రైడ్ మొబైల్ చేతిలో ఉంటే ఏదో రకంగా మోసం చేసే వెక్తులు చాలానే ఉన్నారు.. అదే తరహాలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఓ యువతి వర్ధన్న పేట కు చెందిన యువకున్ని మాట్రిమని యాప్ లొ పరిచయం ఏర్పడి. పరిచయం ప్రేమగా మారి చివరికి యువకుని వద్దా 30 లక్షల రూపాయలు స్వాహా చేసి యువకుని పై భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లొ పిర్యాదు చేసిన యువతి..
వివరాల్లోకి వెళితే...
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన చిద్దురాల సత్యనారాయణ అనే యువకుడు బైక్ మెకానిక్ పని చేస్తూ తల్లిదండ్రులతో జీవిస్తున్నాడు. కాగా సత్యనారాయణ పెళ్ళి కావడం లేదని తన మొబైలు లొ తెలుగు మాట్రిమని అప్ లొ అమ్మాయిలను వెతికే వాడు ఈ క్రమంలో భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మేకల మంజుల అనే యువతి తో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది ఇలా గత రెండు సంత్సరాలనుండి ప్రేమగా నటిస్తూ మనం పెళ్ళి చేసుకుందాం మనకంటూ ఒక ఇళ్ళు ఉండాలి భూపాలపల్లి లొ ఇళ్ళు కొనుక్కోవాలి అని సత్యనారాయణ ను డబ్బులు తెమ్మని చెప్పడంతో ఆ వేక్తి దాదాపు ముప్పై లక్షల వరకు డబ్బులు తీసుకు వచ్చి భూపాలపల్లి టౌన్ రామ్ నగర్ వద్ద ఒక పురాతన ఇళ్ళు కొని దానిని మరికొన్ని డబ్బులతో రిపేర్ చేసి కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు కాగా కొన్న ఇళ్ళు మంజుల పేరు మీద రిజిస్టేషన్ చేపించుకొని చివరికి సత్యనారాయణ ను దూరం చేసింది. అదే కాకుండ ఆ యువతికి పెళ్లి అయి ఒక కుమార్తె కూడ ఉన్నట్టు సత్యనారాయణ కు తెలియడం తో వర్ధన్న పేట పోలీస్ స్టేషన్ లొ పిర్యాదు చేసాడు. వర్ధన్న పేట పోలీస్ లు భూపాలపల్లికి పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించగా సత్యనారాయణ పై మంజుల పిర్యాదు చేసినట్టు చెప్పడం తో కంగు తిన్న యువకుడు భూపాలపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చి జరిగిన విషయo ఎస్సై కి వివరించడంతో ఎంక్వయిరీ చేసి ఇరుపక్షాల వాదనాలతో అబ్బాయికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.






0 Comments