తీర్మాన ప్రతి సమర్పించడంలో ఆలస్యంపై సర్పంచ్ కు షో కాజ్ నోటీసు జారీ
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల/చెన్నూరు:మే 12, 2026:(నేటి ఇజం)
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి సంబంధించిన గ్రామపంచాయతీ తీర్మానం ప్రతిని సమర్పించడంలో జాప్యంపై చెన్నూర్ మండలం సోమనపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ తోకల మల్లేష్ కు షో కాజ్ నోటీసు జారీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిచ్చి, మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మండలం సోమన్‌పల్లి గ్రామ పంచాయతీలో మంజూరు చేసి పాఠశాల నిర్మాణానికి తగినంత నిధులను విడుదల చేస్తుందని తెలిపారు. పాఠశాల నిర్మాణానికి అవసరమైన గ్రామ పంచాయతీ తీర్మానం ప్రతిని సమర్పించడంలో విపరీతమైన జాప్యం జరుగుతున్నట్లు గమనించడం జరిగిందని, ఈ విషయమై సరైన వివరణ కోరుతూ నోటీసు జారీ చేయడం జరిగిందని, సకాలంలో వివరణ అందించని పక్షంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 37(5) చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.komuraiahramadugu12@gmail.com
komuraiahramadugu12@gmail.com
రామడుగు కొమురయ్య ఎడిటర్
నేటి ఇజం


0 Comments