ఎసిబి కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్


 ఎసిబి కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్

కొమరవెల్లి: మే 12/26:(నేటి ఇజం)

 10 వేలు లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ భర్త ఎసిబి అధికారులకు చిక్కారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎసిబి అధికారుల కథనం ప్రకారం.. కొమురవెల్లి గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడి ప్లాట్‌లో గ్రామ పంచాయతీ వారు డ్రైనేజీ పైప్‌లైన్‌ వేశారు

ఆ పైప్‌లైన్‌ను అక్కడ నుంచి తొలగించాలనే అధికారిక పని కోసం పంచాయతీ కార్యదర్శి గడ్డం రాజు గౌడ్ పది వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఎసిబిని ఆశ్రయించడంతో పక్కా ప్రణాళికతో అధికారులు పట్టుకున్నారు.

సర్పంచ్ భర్త ద్వారా నగదు స్వీకరణ… సోమవారం సాయంత్రం 4.40 గంటల సమయంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే లంచం డబ్బులు తీసుకుంటుండగా అధికారులు దాడి చేశారు.

పంచాయతీ కార్యదర్శి ఆదేశాల మేరకు సర్పంచ్ గొల్లపల్లి పద్మ భర్త గొల్లపల్లి అంజనేయులు.. ఆ పది వేల రూపాయలను స్వీకరించారు. ఎసిబి అధికారులు వారిద్దరినీ పట్టుకుని, లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

పంచాయతీ కార్యదర్శి ఆదేశాల మేరకు సర్పంచ్ గొల్లపల్లి పద్మ భర్త గొల్లపల్లి అంజనేయులు.. ఆ పది వేల రూపాయలను స్వీకరించారు. ఎసిబి అధికారులు వారిద్దరినీ పట్టుకుని, లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.komuraiahramadugu12@gmail.com


Post a Comment

0 Comments