ప్రజల గొంతు నొక్కుతున్న కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ లీడర్స్ పై చర్య తీసుకోవాలి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి డిమాండ్



  ప్రజల గొంతు నొక్కుతున్న కాంగ్రెస్ నాయకులు 

 కాంగ్రెస్ లీడర్స్ పై చర్య తీసుకోవాలి 

 బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి డిమాండ్ 

బెల్లంపల్లి: కన్నె పల్లె: నేటి ఇజం: 08/03/2026

కన్నెపల్లి మండల కేంద్రoలో కెజిబివి పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారని వార్త రాసిన ఎన్కె 24 రిపోర్టర్ చంద్రశేఖర్ పై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై చర్య తీసుకోవాలి అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యల్ని వెలికి తీస్తున్న విలేకరి పై దాడి చేయడం శోచనీయం అన్నారు. కాంగ్రెస్ నాయకులు అధికార మదంతో వ్యవహరిస్తున్నారని , వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిపోర్టర్లకు రక్షణ కల్పించాలని అన్నారు. నాసిరకంగా గోడ నిర్మిస్తున్న కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని, ఆయన లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


నేటి ఇజం: రామడుగు కొమురయ్య సీఈవో



komuraiahramadugu12@gmail.com


Post a Comment

0 Comments