హైదరాబాద్‌కు భారీగా తరలిన తెలంగాణ ఉద్యమకారులు
ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
గుండేటి ఐలయ్య యాదవ్
పెద్దపల్లి: నేటి ఇజం: 10/03/2026
పెద్దపల్లి జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు మంగళవారం హైదరాబాద్‌లో గన్ పార్క్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ఉద్యమం మిలియన్ మార్చ్ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివెళ్లారు. రాష్ట్ర కన్వీనర్ మరియు జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఉద్యమకారులు సుల్తానాబాద్ నుండి బయలుదేరారు.
ఈ సందర్భంగా ముందుగా పెద్దపల్లి పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి, కొబ్బరికాయ కొట్టి బస్సును ప్రారంభించారు. అనంతరం “జై తెలంగాణ – తెలంగాణ అమరవీరులకు జోహార్” అంటూ నినాదాలు చేస్తూ హైదరాబాద్‌కు బయలుదేరారు.
ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాదాపు 13 సంవత్సరాల పాటు నిరంతరంగా పోరాటం చేశామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు మారుతాయని నమ్మకంతో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉద్యమాన్ని ముందుకు నడిపామని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అనేక మంది ఉద్యమకారులు ఉన్నారని, రాష్ట్ర సాధన కోసం తమ ఆర్థిక వనరులను ఖర్చు చేసి తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. కనీసం ఇప్పుడు అయినా ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరారు.
ఇటీవల రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉద్యమకారులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణ రావు గారు , రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ గారు, ఎంపీ వంశీ గార్ల నాయకత్వంలో ఈ ప్రాంత ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు దొబ్బడ చంద్రకళ, నూనె రాజేశం, బింగి రాజు, మంతిని విజయ్ కుమార్, గోగుల రాజిరెడ్డి, చర్లపల్లి సురేష్ గౌడ్, ఆల శ్రీనివాస్ రెడ్డి, లలితా ఠాగూర్, కందుల అశోక్ పటేల్, జనగామ రవి, గుజ్జుల పద్మ, జ్యోతి ఠాగూర్, మద్దెల సంజీవ్, కట్ల ప్రతాప్, గోవిందుల ఎల్లస్వామి, గుర్రాల వీరేశం, పంగ రవి తదితరులు పాల్గొన్నారు.
రామడుగు కొమురయ్య/సీఈవోనేటి ఇజం





0 Comments