కాల్వ శ్రీరాంపూర్ మండల తహసీల్దార్ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు








కాల్వ శ్రీరాంపూర్ మండల తహసీల్దార్ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు 

నేటి ఇజం: పెద్దపెల్లి జిల్లా: కాల్వ శ్రీరాంపూర్: 10/03/2026

పెద్దపల్లి నియోజకవర్గం కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో రూ. 75 లక్షలతో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారితో కలిసి ప్రారంభించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు 

ముందుగా  ఎమ్మెల్యే విజయరమణ రావు గారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం కాల్వ శ్రీరాంపూర్ మండల తహసీల్దార్ పుల్లూరీ జగదీశ్వర్ రావు గారికి తన ఛాంబర్లో సన్మానించిన ఎమ్మెల్యే విజయరమణ రావు గారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దాసరి వేణు, ఆర్డీవో గంగయ్య, స్థానిక సర్పంచి బంగారి రమేష్, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్, డైరెక్టర్లు, పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

komuraiahramadugu12@gmail.com



Post a Comment

0 Comments