దాడి చేసిన వారిపై సాధారణ కేసులు వార్త రాసిన రిపోర్టర్ పై అట్రాసిటీ కేసా కన్నెపెల్లి అధికారులు ఇదేం తీరు ఫైర్ అయిన జర్నలిస్ట్ సంఘాలు




దాడి చేసిన వారిపై సాధారణ కేసులు 

వార్త రాసిన రిపోర్టర్ పై అట్రాసిటీ కేసా 

కన్నెపెల్లి అధికారులు ఇదేం తీరు 

ఫైర్ అయిన జర్నలిస్ట్ సంఘాలు 

నేటి ఇజం: హైదరాబాద్: 10/03/2026

గత రెండు రోజుల క్రితం 

జర్నలిస్టు మిత్రుడు మంచిర్యాల జిల్లా కన్నెపెల్లి మండలం లో nk24tv లో రిపోర్టర్ గా సేవలు అందిస్తున్నారు ఈ నెల 5వ తేదీన కేజీబీవీ పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణం లో నాన్యత లోపించింది అధికారులు చర్యలు తీసుకువాలని వార్త రాసినందుకు కాంట్రాక్టర్, సర్పంచ్ భర్త, ఉప సర్పంచ్,2 వార్డ్ సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మరియు మరో అయిదు గురు దుండగులు రిపోర్టర్ ను చంపేస్తాం ని అంతు చూస్తాం ఎవడ్రా నిన్ను వార్త రాయమని చెప్పింది ఇసుకతోనే నిర్మాణం చేస్తాం ఎవ్వనికన్నా చెప్పుకో మాకు ఎమ్మెల్యే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారని భూతులు తిడుతూ భౌతిక దాడి చేయడం శోచనీయం, దాడి చేసిందే కాక నాయకుల అండ దండలతో రిపోర్టర్ పైనే SC, ST అట్ట్రాసిటీ కేసు నమోదు చేయడం విడ్డురంగా ఉంది 

తప్పుడు కేసులు బనాయిస్తున్న పోలీసు అధికారులపై సంబంధిత పై అధికారులు వెంటనే స్పందించాలి లేని యెడల తెలంగాణ యూట్యూబ్ డిజిటల్ న్యూస్ అసోసియేషన్ తరపున రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతాం

నాణ్యత లోపంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ వ్యక్తి నీ ప్రశ్నిస్తే జర్నలిస్టు మిత్రుడిపై స్థానిక నాయకుడి అండదండలతో యదేచ్చగా జరుపుతున్న అక్రమ దందా కాంట్రాక్ట్ వ్యక్తి దాడికి పాల్పడ్డా కాంట్రాక్టు వ్యక్తి మరియు వారి యొక్క సిబ్బంది పై వెంటనే చట్టరీత్యా తగు చర్య లు తీసుకోవాలని ఇట్టి విషయమై తెలంగాణ యూట్యూబ్ డిజిటల్ మీడియా న్యూస్ ఛానల్ అసోసియేషన్ తరపున దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే జర్నలిస్టు మిత్రుడికి తగు న్యాయం చేకూర్చాలని సూచిస్తున్నాం రాజకీయ నాయకుడికి కొమ్ముకాసే విధంగా వ్యవహరిస్తే  ఊరుకునేది లేదని అసోసియేషన్ హెచ్చరించారు. కాంట్రాక్టర్ నాణ్యత లోపాన్ని పసిగట్టిన జర్నలిస్టు వ్యక్తిపై దాడి చేసిన వ్యక్తులపై దాడి చేసిన వీడియో ఆధారంగా అటెంప్ట్ మర్డర్ సరైన కేసు నమోదు చేయకుండా దాడికి గురైన వ్యక్తిపై పోలీసు వ్యవస్థ తప్పుడు కేసు బనాయించడం నిరసిస్తూ ఆ కేసును వెంటనే తొలగించాలని దాడి చేసిన వ్యక్తిపై చట్టరీత్యా జర్నలిస్టు ఆక్ట్ ప్రకారం గా తగు చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో రాష్ట్ర స్థాయిలో ఉదృతంగా ఉద్యమ కార్యక్రమాలను చేపడతామని ఆయా శాఖల వారి కి జిల్లా కలెక్టర్, సిపి, డిసిపి, స్థానిక సీఐ, ఎస్ఐ, గార్లకు తెలియజేస్తున్నాం కార్యక్రమంలో అసోసియేషన్ వివిధ చానల్స్ సీఈఓ లు, రిపోర్టర్ లు పాల్గొన్నారు.


రామడుగు కొమురయ్య సీఈవో

STJ న్యూస్ ఛానల్/నేటి ఇజం దినపత్రిక ఎడిటర్




Post a Comment

0 Comments