ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ తరగతులు*



 *ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ తరగతులు*

నేటి ఇజం: జైపూర్: 27/02/2026

తేదీ:-23.02.2026 నుండి 27.02.2026 వరకు (5) రోజులు జైపూర్ మండలంలోని 10 గ్రామపంచాయతీలో వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు రైతు వేదిక, జైపూర్ నందు నిర్వహించడం జరిగింది. శిక్షణ తరగతుల యందు (94) మంది వార్డు సభ్యులు హాజరు కావడం జరిగింది. నలుగురు TOT లు ఐదు రోజులు వార్డు సభ్యులకు సర్పంచ్ , వార్డు సభ్యుల విధులు, నూతన పంచాయతి రాజ్ చట్టం, గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయాలు, నిర్వహించే రికార్డులు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పథకాలు తదితర అంశాలపై శిక్షణ అందించడం జరిగింది.

ఈరోజు తేదీ:- 27.02.2026 చివరి రోజు అయినందున ఈ ఐదు రోజులు వార్డు సభ్యులు నేర్చుకున్న అంశాలపై పరీక్ష నిర్వహించి సర్టిఫికేట్లు అందజేయడం జరిగింది. ఇట్టి శిక్షణ తరగతులకు హాజరైన వార్డు సభ్యులు మాట్లాడుతూ ఈ 5 రోజుల శిక్షణ తరగతులు తమకు ఎంతగానో ఉపయోగ పడ్డాయని, చాలా క్రొత్త విషయాలు నేర్చుకున్నామని, పంచాయితి రాజ్ చట్టంపై మరియు ఇతర అంశాలపై పూర్తి అవగాహన కలిగించి, మండల కేంద్రంలోని రైతు వేదిక నందు 5 రోజులు చక్కగా శిక్షణ అందించి, శుభ్రమైన నీరు ఆహారం అందించి నందుకు దన్యవాదములు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తూ తమ అనుభవాలు పంచుకున్నారు.

 ఇట్టి కార్యక్రమంలో గౌరవ ఎంపిడిఓ శ్రీ జి.సత్యనారాయణ గారు మరియు ఎంపీఓ శ్రీ శ్రీపతి బాపు రావు గారు హాజరై శిక్షణ తరగతులలో నేర్చుకున్న అంశాలను గ్రామ పంచాయతీలలో అమలులోకి వచ్చేటట్లు చేసి, గ్రామ పంచాయతీలను ప్రగతి పథంలో నడిపించాలని సూచించారు. అనంతరం, వార్డు సభ్యులకు సర్టిఫికేట్లు అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గౌరవ ఎంపిడిఓ ఎంపీఓ లతో పాటు TOT లు శ్రీ పి.సురేష్, N.దేవేందర్, M. సురేష్ , E. రమేష్, ఇందారం సర్పంచ్ ఫయాజ్ గారు, పంచాయతి కార్యదర్శులు సుమన్, సురేష్, ఉదయ్, సత్యనారాయణ,సురేందర్, సాయి రజిత, తిరుమల, రమాదేవి, పావని, వివిధ గ్రామాల వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు



Post a Comment

0 Comments