*కృతజ్ఞత సభకు హాజరుకావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం*
*తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి కృషి చేయండి*
*మార్చ్ 1న కరీంనగర్ లో జరిగే సభకు భారీగా తరలి రావాలని ఉద్యమకారులకు పిలుపు*
నేటి ఇజం: మంతిని: 28/02/2026
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన అనంతరం మార్చ్ 1న కరీంనగర్ ఫిలిం భవన్ లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల కృతజ్ఞత సభకు ఆహ్వానించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు గుండేటి ఐలయ్య యాదవ్
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించాలని కోరమని ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు
మంత్రి గారు సానుకూలంగా స్పందించి అసెంబ్లీ సమావేశాలలో చర్చిస్తామని హామీ ఇచ్చారని తెలిపినట్టు చెప్పారు
ఈ కార్యక్రమంలో నూనె రాజేశం ,కందుల సదాశివ , చంద్రకళ , బత్తుల శంకర్ , సుధాకర్ , సురేష్ మరియు తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు..


0 Comments