జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా శ్రీనివాస్ రావు బాధ్యతల స్వీకరణ



జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా శ్రీనివాస్ రావు బాధ్యతల స్వీకరణ

ఫిబ్రవరి 28, 2026 : మంచిర్యాల: నేటి ఇజం:

మంచిర్యాల రాజస్వ మండల అధికారిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా పని చేసిన పి.చంద్రయ్య పదోన్నతి పై జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా విధులు నిర్వహిస్తున్నారు.


Post a Comment

0 Comments