నకిలి నోట్లను చలామణి చేస్తున్న ఎనిమిది వ్యక్తులు అరెస్టు



 నకిలి నోట్లను చలామణి చేస్తున్న ఎనిమిది వ్యక్తులు అరెస్టు

వరంగల్ జిల్లా: నర్సంపేట: 04/05/2026:(నేటి ఇజం)

నకిల నోట్లను తయారుచేసి (ప్రింట్ తీసి) మార్కెట్లో చలామణి చేస్తున్న ముగ్గురు వ్యక్తులను మరియు తెలంగాణలో తక్కువ డబ్బులకు, ఎక్కువ డబ్బులను 1:3లో తయారుచేసి ఇస్తామని చెప్పి కోరిన వారికి రూపాయలు 500 నోట్ల పరిమాణంలో నెల్ల కాగితలను ఇస్తూ మోసాగిస్తున్న ఐదుగురు వ్యక్తులను వరంగల్ టాస్క్ ఫోర్స్ మరియు నర్సంపేట పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు.

 అరెస్టు చేసిన నిందితుల నుండి నకిటి నోట్లను, అసలు 1,48,000 రూపాయలను మరియు సుమారు 28 లక్షల విలువగల ల్యాప్ టాప్ లు, ప్రింటర్స్, 13 సెల్ ఫోన్లు మరియు రెండు కార్లులను స్వాధీన పరుచుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన నిందితులు: 1) శాగంటి కిరణ్, నివాసం: నర్సంపేట: 2) నీరటి శివ, నివాసం: నర్సంపేటి మరియు 3) నీరటి రంజిత్, నివాసం: నర్సంపేట, 4) గుడికందుల రవి, నివాసం: నర్సంపేట: 5) పోరిక రాజ్కుమార్ @ రాజు, నివాసం: ఘన్ పూర్ (ములుగు), 6) తనమాల రాజశేఖర్, నివాసం: వేంసూరు, ఖమ్మం: 7) ముదురుకోల యాకంబరం, నివాసం: తాతానగర్, భువనగిరి: 8) చేను సాయికిరణ్, నివాసం: కారకగూడెం (మండలం), కొత్తగూడెం కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

komuraiahramadugu12@gmail.com

komuraiahramadugu12@gmail.com
రామడుగు కొమురయ్య ఎడిటర్

నేటి ఇజం

Post a Comment

0 Comments