సీతారాంపల్లి క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను పరిశీలించిన మేయర్ ధరణి మధుకర్




 సీతారాంపల్లి క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను పరిశీలించిన మేయర్ ధరణి మధుకర్

నస్పూర్: 04/05/2026:(నేటి ఇజం)

99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా *మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 09 వ డివిజన్ లో జిల్లా వ్యవసాయ శాఖ మరియు హార్టి కల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్ష కార్యక్రమానికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది.

మేయర్ గారు సీతారాంపల్లి క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను పరిశీలించి అధికారులతో సమీక్షించి తగిన సూచనలు చేయడం జరిగింది.

మేయర్ గారు మాట్లాడుతూ రానున్న వేసంగి లో రైతులు సన్నపు వడ్లు పండివ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం సన్న వడ్ల కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో రైతులు సాగులో తీసుకోవాల్సిన మెలకువలు,వాడాల్సిన ఎరువులు,పురుగుల మందుల గురించి రైతులకు అవగాహన కల్పించారు.

అదేవిధంగా హార్టీ కల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రైతులకు ఉద్యానవన పంటలపై రాయితీల గురించి అవగాహన కల్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు 09 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సురిమిల్ల సౌమ్య వేణు గార్లు,Aeo సంధ్య రాణి గార్లు,AO మహేందర్ గారు,డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ అనిత,DHSO వెటర్నిటీ సర్జన్ తిరుపతి,ఆర్టికల్చర్ ఆఫీసర్ సహజ,AMC డైరెక్టర్లు దర్ని మల్లేష్,  ధోనిపెల్లి లింగయ్య స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు,సీతారాంపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 komuraiahramadugu12@gmail.com

komuraiahramadugu12@gmail.com
రామడుగు కొమురయ్య ఎడిటర్

నేటి ఇజం

Post a Comment

0 Comments