కార్మిక క్షేత్రంలో కార్మికొద్యమాలు బలోపేతం చేయండి ఏఐటీయూసీ రామగుండం నగర మూడో మహాసభలో సిపిఐ-ఏఐటియుసి జిల్లా కార్యదర్శులు తాండ్ర సదానందం,కడారి సునీల్ లా పిలుపు



 కార్మిక క్షేత్రంలో కార్మికొద్యమాలు బలోపేతం చేయండి

 ఏఐటీయూసీ రామగుండం నగర మూడో మహాసభలో సిపిఐ-ఏఐటియుసి జిల్లా కార్యదర్శులు తాండ్ర సదానందం,కడారి సునీల్ లా పిలుపు

రామగుండం: 04/05/2026:(నేటి ఇజం)

 ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ రామగుండం నగర సమితి మూడో మహాసభలు ఎఫ్ సి ఐ క్రాస్ రోడ్ లోని కృష్ణ ఫంక్షన్ హాల్ లో హట్టహాసంగా ఎర్ర తోరణాలతో పండుగ వాతావరణంలో జరిగింది. మహాసభ సూచికoగా  ముందుగా ఏఐటీయూసీ సినియర్ నాయకులు అబ్దుల్ కరీం జెండా ఆవిష్కరణ చేసారు.అమర వీరులకు సంతాపం శనిగరపు చంద్ర శేఖర్ ప్రవేశపెట్టినారు.మౌనం పాటించారు. మహాసభలకు అబ్దుల్ కరీం అధ్యక్షత వహించగా, శనిగరపు చంద్ర శేఖర్ కార్యదర్శి నివేదికా ప్రవేశపెట్టిన అనంతరం సభలో మన ముఖ్య అతిథులుగా సిపిఐ-ఏఐటీయూసీ జిల్లా జిల్లా కార్యదర్శులు తాండ్ర సదానందం, కడారి సునీల్,కార్పొరేటర్ మార్కాపూరి సూర్య లు పాల్గొని ప్రసంగిస్తూ కార్మిక క్షేత్రంలో కార్మికోద్యమాలు బలోపేతం చేయాలని కార్మిక వర్గానికి వారు పిలుపునిచ్చారు. ఇది పారిశ్రామిక ప్రాంతం ఈ కార్మిక క్షేత్రంలో ఉన్న సంఘటిత కార్మికులు తమ హక్కుల కోసం ఏఐటీయూసీ జెండా అండగా ఉంటుందని పోరాటాలు చేసి తమ హక్కుల కోసం ఉద్యమాలు చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈనెల 24న సుల్తానాబాద్ లో జరిగే ఏఐటీయూసీ నాలుగో మహాసభలను విజయవంతం చేయాలని వారు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. కేంద్రంలో బి జె పి మోడీ ప్రభుత్వం అతి క్రూరంగా కార్మిక వర్గాన్ని బజారున పడేసే విదంగా పెట్టుబడి దారులైన ఆదాని, అంబానిలు మరింత సంపన్నులు అయ్యేందుకు 44 కార్మిక చట్టాలను తొలగిస్తామనే ఆలోచనను విరమించుకోవాలని నరేంద్ర మోడీ ఖబర్దార్ కార్మికుల అగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. ఈ మహాసభ కార్యక్రమంలో ఏఐటీయూసీ రామగుండం నగర సమితి నాయకులు అబ్దుల్ కరీం,శనిగరపు తిరుమల -చంద్రశేఖర్, యేర్రల లేనిన్ రెడపాక లక్ష్మిన్, నాంసాని శంకర్, వైనాల రవి, కలికోట సతీష్ కుమార్, ఓదెల రమేష్,పులిపాక విజయలక్ష్మి శేఖర్ భోగే వందన పిట్టల అమూల్య పాకాలపాటి నాగమణి శేఖర్ బుర్ర సాయి చరణ్ సకటం రమ్యశ్రీ దాసం సుబ్బరాజు తణుకు సత్యనారాయణ రేణిగుంట్ల పోశం కాంపల్లి రాజయ్య కాసిపేట రాజేశ్వరి జులా లక్ష్మి షేక్ మసూద్ బాల్ రాజ్ ఐలక్క తదితరులు పాలుగోన్నారు.komuraiahramadugu12@gmail.com

 

komuraiahramadugu12@gmail.com

రామడుగు కొమురయ్య ఎడిటర్

9618889897

Post a Comment

0 Comments