శ్రమ శక్తి అవార్డు గ్రహీత, ఐఎన్‌టియుసి సెంట్రల్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు,ఏరియా ఉపాధ్యక్షులు
జెట్టి శంకర్ రావుకు ఘన సన్మానం.
నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో సత్కరించిన జననేత,టిపిసిసి నాయకులు పెర్క శ్యామ్
నస్పూర్: 03/05/22026:(నేటి ఇజం)
కార్మిక నేత, ఐఎన్‌టియుసి INTUC నాయకులు జెట్టి శంకర్ రావు గారికి ప్రతిష్టాత్మకమైన 'శ్రమ శక్తి' అవార్డు లభించిన సందర్భంగా నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జననేత, టిపిసిసి TPCC నాయకులు పెర్క శ్యామ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, శంకర్ రావు గారిని శాలువాతో సత్కరించి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పెర్క శ్యామ్ గారు మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం నిరంతరం పోరాడే జెట్టి శంకర్ రావు గారికి శ్రమ శక్తి అవార్డు రావడం మన ప్రాంతానికి గర్వకారణమని కొనియాడారు. ఆయన కష్టానికి, నిబద్ధతకు దక్కిన గౌరవమిదని, భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
అనంతరం జెట్టి శంకర్ రావు గారు మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి అవార్డు అందించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, తనను గౌరవించిన పెర్క శ్యామ్ గారికి మరియు ప్రెస్ క్లబ్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో intuc srp division నాయకులు, pit కమిటీ నాయకులు పాల్గొన్నారు.



0 Comments