కాషాయమయంగా కొండగట్టు దేవాలయం

కాషాయమయంగా కొండగట్టు దేవాలయం

జగిత్యాల జిల్లా: మే 12:(నేటి ఇజం)

హనుమాన్ పెద్ద జయంతి వేడుకలకు కొండగట్టు క్షేత్రం ముస్తాబైంది, ఈరోజు మంగళవారం జరగను న్న కొండగట్టు పెద్ద జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు హనుమాన్ భక్తులతో పాటు... దీక్షపరుల రాకతో కొండగట్టు  పరిసరాల ప్రాంతాలు కాషాయమయంగా మారాయి వివిధ రాష్ట్రాల జిల్లాల నుంచి వేలాదిగా తరలివస్తున్నారు జైశ్రీరామ్ నినాదాలతో మారుమోగుతుంది,

జయంతి వేడుకల సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారికి తెల్లవారు జాము నుండే ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరపున అధికార యంత్రాంగం అంజన్నకు పట్టు వస్త్రాలను సమర్పించ నుంది. అంజన్న నామ స్మరణతో కొండగట్టు పరిసరాలు మారు మోగుతున్నాయి. 

సోమవారం రాత్రి కొండగట్టు దేవాల యానికి చేరుకున్న కొందరు దూర ప్రాంతాల దీక్షపరులు అంజన్నకు ముడుపు లు ముట్టజెప్పి కళ్యా ణకట్ట భవనంలో మాలవిరమణ చేసి వెళ్తున్నారు. 

భారీగా తరలివస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుం డా జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తాగునీరు, చలువ పందిళ్లు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు, ట్రాఫిక్ నియంత్రణకు భారీగా పోలీసులను మోహరించారు.komuraiahramadugu12@gmail.com

 

komuraiahramadugu12@gmail.com

నేటి ఇజం

Post a Comment

0 Comments