కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి
మందమర్రి, మే 8:(నేటి ఇజం)
మందమర్రి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందమర్రి మండలం మరియు క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు మంత్రి స్వయంగా చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.komuraiahramadugu12@gmail.com
komuraiahramadugu12@gmail.com
రామడుగు కొమురయ్య ఎడిటర్
నేటి ఇజం







0 Comments