టీవీ చూడొద్దని మందలించడంతో యువతి ఆత్మహత్య
మంచిర్యాల జిల్లా:జన్నారం: మే/08/(నేటి ఇజం)
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోటిగూడ గ్రామానికి చెందిన మోత్కూరి అక్షయ (19) అనే డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. అయితే టీవీ చూడద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు జన్నారం ఎస్సై జి. ఉదయ్ కిరణ్ తెలిపారు. అక్షయ తరచూ టీవీ చూస్తుండటంతో తల్లిదండ్రులు చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు.


0 Comments