అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో పెద్దపెల్లి జిల్లా ముందంజం మే 6న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత వినియోగించుకోవాలి రాష్ట్రంలో అగ్రస్థానంలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి రైతులు పంట మార్పుపై దృష్టి పెట్టాలి ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు












 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో పెద్దపెల్లి జిల్లా ముందంజం

మే 6న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత వినియోగించుకోవాలి

రాష్ట్రంలో అగ్రస్థానంలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి

రైతులు పంట మార్పుపై దృష్టి పెట్టాలి

 ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు  చింతకుంట విజయరమణ రావు 

పెద్ద పల్లి: 02/05/2026:(నేటి ఇజం)

పెద్దపల్లి పట్టణంలోని బందంపల్లి స్వరూప గార్డెన్స్‌లో నిర్వహించిన పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గారు, డిసిపి రామ్ రెడ్డి మరియు ఉన్నత అధికారులతో కలిసి పాల్గొన్న గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు  చింతకుంట విజయరమణ రావు 

అనంతరం ఓదెల మండలం పోతకపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి పరీక్షల్లో గొప్ప మార్కులు సాధించిన విద్యార్థులను గౌరవ ఎమ్మెల్యే విజయరమణ రావు  అభినందించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  విజయరమణ రావు  మాట్లాడుతూ

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో పూర్తి స్థాయిలో అమలవుతున్నాయని తెలిపారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచి 4 అవార్డులు సాధించిందని, ఓపీ సంఖ్య 280 నుండి 900కు మరియు మాసంలో ప్రసవాలు 40 నుండి 250కు పెరిగినట్లు పేర్కొన్నారు. 

కొత్త ఆసుపత్రి భవనం నిర్మాణం వేగంగా జరుగుతోందని, ఎం.ఆర్.ఐ స్కాన్, సీటీ స్కాన్ సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సేవలు ఉచితంగా అందిస్తున్నామని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చయ్యే చికిత్సను ఇక్కడ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఇతర ప్రాంతాల ప్రజలు కూడా పెద్దపల్లి ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రం, డయాలసిస్, కార్డియాలజీ, 2డి ఎకో వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

మహిళల సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, వడ్డీరహిత రుణాలు, వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి కోతలు లేకుండా 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు.

రైతులు పంట మార్పుపై దృష్టి పెట్టాలని, వరి, మొక్కజొన్నలతో పాటు ఇతర పంటలను కూడా పండించాలని సూచించారు. మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం మక్కాజొన్న రైతులకు మద్దతు ధర ఇస్తోందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళామణులకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్ల బోనస్ మరియు అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా ప్రజలకు అందిస్తుందని ఎమ్మెల్యే విజయరమణ రావు గారు వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఆర్డీవో, ప్రభుత్వ ఉన్నత అధికారులు మరియు కౌన్సిలర్లు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.komuraiahramadugu12@gmail.com

komuraiahramadugu12@gmail.com
నేటి ఇజం: ఎడిటర్

Post a Comment

0 Comments