మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పర్యటన




మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్  పర్యటన

సీతారాం పల్లె:27/04/2026;(నేటి ఇజం)

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 09 వ డివిజన్ సీతారాంపల్లి గ్రామంలోనీ రైతు వేదిక వద్ద ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రం ను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ వేసవి కాలంలో పండించిన వారి ధాన్యాన్ని చుట్టూ పక్కల గ్రామాల రైతులు సీతారాంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని,వారం పదిరోజుల్లోనే మీ ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందని,సన్న వడ్లు పండించిన రైతాంగానికి 500/- బోనస్ కూడా అందచేయడం జరుగుతుందని,ఏమైనా లోటుపాట్లు ఉంటే మా దృష్టికి తీసుకువస్తే సత్వరమే పరిష్కరిస్తామని ఆయన తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు స్థానిక కార్పొరేటర్ సురిమిల్ల సౌమ్య వేణు గార్లు, సింగిల్ విండో డైరెక్టర్ దర్ని మల్లేష్ గారు, డైరెక్టర్ లింగన్న,ఐకెపి సెంటర్ ఇంచార్జి సురిమిల్ల వర్ష గారు, ఏఈ వో సంధ్య గారు,మెఫ్మా టీఎంసీ నాగరాజు గారు,స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు,స్థానిక ప్రజలు,వివిధ గ్రామాల రైతాంగం పాల్గొన్నారు.

 

Post a Comment

0 Comments