నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్
మంచిర్యాల జిల్లా: నస్పూర్: 22/04/2026:(నేటి ఇజం)
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని *నస్పూర్ పరిధిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది.
నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న వైద్య సేవలు,పేషెంట్లు కు కల్పిస్తున్న వైద్య సదుపాయాలపై ఆరా తీయడం జరిగింది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యవసర సేవలు అందుబాటులో ఉంచాలని,వైద్యులు సాధ్యమైనంత వరకు ప్రాథమిక వైద్యాన్ని అందించాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పెద్ద ఆసుపత్రి కి రెఫరల్ చెయ్యాలని ఈ సందర్భంగా సిబ్బంది కు సూచించారు.
ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు వైద్యులు నక్క వెంకటేష్ ఆసుపత్రి సిబ్బంది, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.komuraiahramadugu12@gmail.com
komuraiahramadugu12@gmail.com
నేటి ఇజం










0 Comments