వరి ధాన్యం కొనుగోలులో గింజ కటింగు ఉండదు ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి రైతులకు అండగా ప్రజాప్రభుత్వం ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు


వరి ధాన్యం కొనుగోలులో గింజ కటింగు ఉండదు

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

రైతులకు అండగా ప్రజాప్రభుత్వం

 ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు 

పెద్దపల్లి:24/04/2026:(నేటి ఇజం)

పెద్దపల్లిపట్టణంలోని చందపల్లి మరియు పెద్దపల్లి మండలంలోని తుర్కల మద్దికుంట, నిట్టూరు, నిమ్మనపల్లి, పెద్దకల్వల, పెద్ద బొంకూర్, కొత్తపల్లి, మూలసాల, భోజన్నపేట, మారేడుగొండ మరియు గుర్రంపల్లి గ్రామాల్లో శుక్రవారం రోజున అధికారులు, స్థానిక నాయకులతో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు  చింతకుంట విజయరమణ రావు గారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు  మాట్లాడుతూ

గత బిఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉండగా 40 కిలోల బస్తాకు ఐదు కిలోల నుంచి పది కిలోల వరకు తరుగు పేర వరి ధాన్యం కటింగ్ చేసి రైతులను నిలువునా ముంచారు అన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అయిదు పసలు వరి పండితే ఎక్కడ కూడా గింజ కటింగ్ జరగలేదని వడ్లు తడిసిన, మొలకలు వచ్చిన, రంగు మారిన రైతులకు ఇబ్బంది కలగకుండా వరి ధాన్యం అమ్మించడం జరిగింది అన్నారు. ప్రభుత్వం సన్న వడ్లు పెట్టిన రైతులకు బోనస్ ఇవ్వడంతో సీడ్ కంపెనీలు కూడా వరి ధాన్యమును కటింగ్ చేయకుండా సీడు దాన్యమును ఎక్కువ ధర పెట్టి కొనడంతో పాటు అన్ని ఖర్చులు సీడ్ కంపెనీ వారే భరిస్తున్నారని దానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. 2024 - 2025, 2026 లో సన్న వడ్లకు బోనస్ పెద్దపల్లి మండలంలో రైతులకు 42 కోట్ల 65 లక్షల వరకు రావడం జరిగింది అన్నారు. కెసిఆర్ ఈ రాష్ట్రంలో విద్యుత్ కోత ఉందని తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని, ఎక్కడ విద్యుత్ కోత ఉందో కెసిఆర్ ఏ చెప్పాలని ఇది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. విద్యుత్ కోతలు ఉంటే ఇన్ని పంటలు ఎలా పండుతాయని అన్నారు. రైతులకు గత పది ఏళ్లలో సాగునీరు అందక ఇబ్బంది పడ్డారని ప్రస్తుతం ఈ సాగునీరు మాకు వద్దంటూ నాకు ఫోన్లు కూడా చేస్తున్నారని రైతుల సంక్షేమం కోసం  ఒక్క గుంట ఎండకుండా సాగునీరు అందించాను అన్నారు.

ఈ కార్యక్రమంలో  పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్, పలు గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్లు మరియు మాజీ ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు సింగిల్ విండో సీసీలు,పలు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.komuraiahramadugu12@gmail.com

 

komuraiahramadugu12@gmail.com

నేటిజం: ఎడిటర్ 

Post a Comment

0 Comments