24 గంటల్లో హత్యను చాకచక్యంగా చేదించిన జైపూర్ పోలీసులు
మంత్రాల నేపంతో బెజ్జాలలో దారుణ హత్య
నిందితులు అరెస్టు రిమాండ్కు తరలింపు
జైపూర్ మండలం: బెజ్జాల: 23/04/2026:(నేటి ఇజం)
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బెజ్జాల గ్రామానికి చెందిన గుమ్ముల రాజం నిన్న దారుణ హత్యకు గురైన వ్యక్తి కేసును 24 గంటల్లో చాకచక్యంగా చేదించిన జైపూర్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు. జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బెజ్జాల గ్రామానికి చెందిన గుమ్ముల తిరుపతి,వెంకటి, నరసమ్మ, రాజబాబు లు తమ కుటుంబానికి మంత్రాలు చేస్తున్నాడని దానివలన నిందితులకు మంచి జరగడం లేదు అని భావించి అందువలన వారు నలుగురు కలిసి ఒక పథకం ప్రకారం తేదీ 21. 04.2026 రోజున సాయంత్రం గుమ్మల రాజం రోజువారి లాగా శివాలయానికి వెళ్లి వస్తుండగా గుమ్మల తిరుపతి కాపు కాసి బెజ్జాల గ్రామ శివారులోని జెట్టి రాజయ్య పొలం మూలమలుపు వద్ద గుమ్మల రాజంని కట్టతో కొట్టి, రాయితో ముఖంపై కొట్టి అట్టి శవాన్ని పక్కన గల సుందిళ్ల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కాల్వలో పడేసినాడు. ఇట్టి సంఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు జైపూర్ పోలీస్ వారు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టి 24 గంటలలో కేసుని చేదించిన జైపూర్ పోలీసులను అభినందించిన ఎసిపి వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో జైపూర్ సిఐ నవీన్ కుమార్, జైపూర్ ఎస్సై రాజశేఖర్, భీమారం ఎస్సై రాజేందర్ కానిస్టేబుల్ పాల్గొన్నారు.komuraiahramadugu12@gmail.com
komuraiahramadugu12@gmail.com
నేటి ఇజం, ఎడిటర్


0 Comments