వరి ధాన్యం కొనుగోలులో గింజ కటింగు ఉండదు
మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోళ్లు
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం
ఓదెల/సుల్తానాబాద్: 29/04/2026(నేటి ఇజం)
ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
సుల్తానాబాద్ మండలంలోని రేగడిమద్దికుంట మరియు ఓదెల మండలం కేంద్రంలో మరియు కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కునారం, మంగపేట, వెన్నంపల్లి, జాఫర్ ఖాన్ పేట గ్రామాల్లో బుధవారం రోజున సింగిల్ విండో, ఐకేపీ మరియు హాకా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్లు మరియు మక్కల కొనుగోలు కేంద్రాలను రైతులతో కలిసి ప్రారంభించిన గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణ రావు
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది అన్నారు. గతంలో మొక్కజొన్న రైతులకు ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ముందుగానే కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు. ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాకు రూ. 2,400/- మద్దతు ధర నిర్ణయించిందన్నారు. రైతుల సౌకర్యార్థం మార్క్‌ఫెడ్ ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీల, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 22 వేల ఎకరాల్లో రైతులు మక్కాజొన్న పంటను సాగు చేశారని దానికి అనుగుణంగా కొనుగోలు చేపడతామని హామీ ఇచ్చారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాణ్యత ప్రమాణాల ప్రకారం మొక్కజొన్నలను కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. రైతులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గత బిఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉండగా 40 కిలోల బస్తాకు ఐదు కిలోల నుంచి పది కిలోల వరకు వడ్లకు తరుగు పేర వరి ధాన్యం కటింగ్ చేసి రైతులను నిలువునా ముంచారు అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అయిదు పసలు వరి పండితే ఎక్కడ కూడా గింజ కటింగ్ జరగలేదని వడ్లు తడిసిన, మొలకలు వచ్చిన, రంగు మారిన రైతులకు ఇబ్బంది కలగకుండా వరి ధాన్యం అమ్మించడం జరిగింది అని అన్నారు. ప్రభుత్వం సన్న వడ్లు పెట్టిన రైతులకు బోనస్ ఇవ్వడంతో సీడ్ కంపెనీలు కూడా వరి ధాన్యమును కటింగ్ చేయకుండా సీడ్డు దాన్యమును ఎక్కువ ధర పెట్టి కొనడంతో పాటు అన్ని ఖర్చులు సీడ్ కంపెనీ వారే భరిస్తున్నాడని కారణం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. కెసిఆర్ ఈ రాష్ట్రంలో విద్యుత్ కోత ఉందని తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని, ఎక్కడ విద్యుత్ కోత ఉందో కెసిఆర్ ఏ చెప్పాలని ఇది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నామని ఎమ్మెల్యే విజయరమణ రావు గారు అన్నారు. విద్యుత్ కోతలు ఉంటే ఇన్ని పంటలు ఎలా పండుతాయని అన్నారు. రైతులకు గత పది ఏళ్లలో సాగునీరు అందక ఇబ్బంది పడ్డారని ప్రస్తుతం ఈ సాగునీరు మాకు వద్దంటూ నాకు ఫోన్లు కూడా చేస్తున్నారని రైతుల సంక్షేమం కోసం ఒక్క గుంట ఎండకుండా సాగునీరు అందించాను అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్లు మరియు డైరెక్టర్లు, మాజీ ఎంపీపీ, ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్ లు, వార్డు సభ్యులు మరియు మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు సింగిల్ విండో &ఐకెపి సీసీలు మరియు పలు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.komuraiahramadugu12@gmail.com
komuraiahramadugu12@gmail.com
నేటి ఇజం: ఎడిటర్






0 Comments