భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కొడవటంచ (కోటంచ) లక్ష్మీనరసింహస్వామి జాతర వైభవంగా జరుగు తోంది.









 కోటంచలో భక్తజన సందోహం

 పెద్ద రతోత్సవంలో ఊరేగిన స్వామివారు 

 పెద్ద రథోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ 

భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కొడవటంచ (కోటంచ) లక్ష్మీనరసింహస్వామి జాతర వైభవంగా జరుగు తోంది.

రేగొండ), మార్చి 4 భూపాలపల్లి జిల్లా: నేటి ఇజం:

రేగొండ మండలంలోని కొడవటంచ (కోటంచ) లక్ష్మీనరసింహస్వామి జాతర వైభవంగా జరుగు తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గంటల తరబడి వేచి ఉండి స్వామి వారిని దర్శించుకున్నారు. బుధవారం రాత్రి పెద్దరథంలొ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని ఊరేగించారు. స్వామి వారి  రథాన్నిలాగిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. జాతరలో ప్రత్యేక ఆకర్షణంగా ప్రభ బండ్లు, ఏనుగ వాహనాలు,తిరుగుట  కోలాహలం నెలకొంది. బుధవారం వివిధ ఘట్టాలు కొనసాగాయి. నిత్యనిధి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వారిని జోగయ్యపల్లి నుంచి ఏనుగువాహనంపై డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ కోటంచకు తీసుకొచ్చారు. ఏనుగు వాహనాన్ని లాగడానికి భక్తులు పోటీపడ్డారు. ప్రభబండ్లు, గుర్రం, మేక వాహనాలతో ఆలయం చుట్టూ ఊరేగించారు.

 ఈ జాతరలో ఆలయ కమిటీ చైర్మన్‌ సంపత్ రావు,, ఈవో మహేష్ , ది డిస్పి సంపత్ రావు,సర్పంచ్‌ చావటి మొగిలి  సీఐ కర్ణాకర్ రావు,,మల్లేష్ యాదవ్ ఎస్సై రాజేష్, త్రిలోక్ నాధ్,ఆలయ అభి వృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



జిల్లా రిపోర్టర్

Post a Comment

0 Comments