కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అమల్లోకి తెస్తున్న నాలుగు లేబర్ కోడ్స్ తక్షణమే వెనక్కి తీసుకోవాలి.* *ఐ కృష్ణ ఐ ఎఫ్ టీ యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు*





         కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అమల్లోకి తెస్తున్న నాలుగు లేబర్ కోడ్స్ తక్షణమే వెనక్కి తీసుకోవాలి

      ఐ కృష్ణ ఐ ఎఫ్ టీ యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

నేటి ఇజం: పెద్దపెల్లి కలెక్టరేట్ :16/03/2026     

ఈరోజు భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నాలుగు లేబర్ కోడ్స్ ,ను తక్షణమే పూర్తిస్థాయిలో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు  సుమారు రెండు గంటల పాటు ధర్నా చేసి కలెక్టర్ గారికి డిమాండ్స్ తో కూడుకున్న వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది.

        అనంతరం *ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ* మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ ను 2019-20 మధ్యకాలంలో పార్లమెంట్ చేత ఆమోదింప చేసుకొని 2025 నవంబర్ 1న నోటిఫై చేసిందని నోటిఫై చేసిన కోడ్స్ ను 2026 ఏప్రిల్ ఒక నుండి అమల్లోకి తెస్తామని ప్రకటించిందని ఈ పరిస్థితుల్లో దేశ కార్మిక వర్గం తో పాటు తెలంగాణ రాష్ట్ర కార్మిక వర్గ ప్రయోజనాలకు వ్యతిరేకమైవని వారి మౌలిక హక్కులు అననానికి దోహదం చేసే లేబర్ కోడ్స్ ను పూర్తిస్థాయిలో వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ మేరకు డిమాండ్ చేశారు.

          ఈనెల 16 నుండి ప్రారంభమయ్యే రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రంలో లేబర్ కోడ్స్ ను అమలు చేయమని తీర్మానం చేసి కేంద్రానికి కార్మిక మంత్రిత్వ శాఖకు పంపాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందన్నారు. 

         కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కార్మిక చట్టాలలో 29 రకాల కార్మిక చట్టాలను క్రోడీకరించి నాలుగు లేబర్ కోర్సును రూపొందించిన విషయం తెలిసిందేనని లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే గత చట్టాల్లో ఉన్న అరాకొర కార్మిక వర్గ ప్రయోజనాలు సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందకుండా పోతాయని కార్మికుల మౌలిక జీవనాధార హక్కులైన కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం, 8 గంటల పని దినం సమ్మె చేసే హక్కు యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కు యాజమాన్యంతో కానీ ప్రభుత్వంతో కానీ నెగోషియేషన్ జరిపే హక్కులకు దూరమయ్యే ప్రమాదం తీవ్రంగా పొంచి ఉందని కోట్లాదిమంది కార్మికులు లేబర్ కోడ్స్ వలన కార్మికుల జాబితా నుండి తొలగించబడతారన్నారు.

          కార్మికులు వారి పని స్థలాల్లో తగిన రక్షణ భద్రత లేక అనేకమంది మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే పాత చట్టాల్లో ప్రమాదకరమైన పరిశ్రమల్లో తనిఖీ వ్యవస్థ ద్వారా పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉంటూ వచ్చిన కానీ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని  ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న అరకు పర్యవేక్షణకు ఉన్న తనిఖీ వ్యవస్థను ఎత్తివేసారని వేతనాల చెల్లింపు, కనీస వేతనం అమలు సమాన పనికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న రాజ్యాంగ నిర్దేశపు ఆదేశాన్ని సుప్రీంకోర్టు తీర్పును బేకాతర చేస్తున్న పరిస్థితుల్లో రూపొందించిన వేతన కోడు ఈ పరిస్థితులకు మరింత తోడు తోడ్పాటు అందిస్తుందనీ అందువలన కార్మిక వర్గ ప్రయోజనాలకు వ్యతిరేకమైన ఈ లేబర్ కోడ్స్ ను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద తగిన స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు

          ఈ కార్యక్రమానికి ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ , ప్రధాన కార్యదర్శిబి అశోక్, ఉపాధ్యక్షులు చిలుక శంకర్ ,ఐ రాజేశం, ఎం దుర్గయ్య,ఎం కొమరయ్య, అరుణోదయ రాష్ట్ర నాయకులు బతుకుల రాజన్న,డీ బుచ్చమ్మ,డి రాజేశం, ఎం కాంతయ్య, కే ఎల్లయ్య, పెరిక వెంకటస్వామి, ఆర్ రాయమల్లు, శోభన్ బాబు, కే మల్లేష్ , ప్రేమ్ కుమార్ దితరులు పాల్గొన్నారు. 


Post a Comment

0 Comments