రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
Mar 17, 2026: నేటి ఇజం: పెద్దపెల్లి జిల్లా: బసంత్ నగర్
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన ఎడ్ల శ్రీనివాస్, రజిత దంపతులు మృతి చెందారు. హైదరాబాద్‌లో చదువుకుంటున్న తమ కూతురు రిషిత వద్దకు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా, కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
రామడుగు కొమురయ్య సీఈఓనేటి ఇజం



0 Comments