ఘనంగా పర్యావరణ దినోత్సవం.మొక్కలు పెంచండిపర్యావరణాన్ని కాపాడండి. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్. జీవవైవిద్యాన్ని కాపాడుకుందాం.భవిష్యత్తు తరాలకు భద్రతనిద్దాం.పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి... వ్యర్థాలను సరైన విధంగా నిర్వహించాలి. జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అసిస్టెంట్ ఇంజనీ ర్ శ్రీమతి మానస. ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించిన.జిల్లా సైన్స్ అధికారి శ్రీ గంగా కిషన్.







ఘనంగా పర్యావరణ దినోత్సవం.మొక్కలు పెంచండిపర్యావరణాన్ని కాపాడండి. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్. 

జీవవైవిద్యాన్ని కాపాడుకుందాం.భవిష్యత్తు తరాలకు భద్రతనిద్దాం.పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు. 

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి వ్యర్థాలను సరైన విధంగా నిర్వహించాలి. జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అసిస్టెంట్ ఇంజనీ ర్ శ్రీమతి మానస. 

ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించిన.జిల్లా సైన్స్ అధికారి శ్రీ గంగా కిషన్. 

 నిజామాబాద్: జూన్ 05/06/2026:(నేటి ఇజం)    

నేడు జిల్లా బాలభవన్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకలు జిల్లా సైన్స్ మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రీజనల్ ఆఫీసు వారు సంయుక్తగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గారు శ్రీ అశోక్ ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు ఆచరణలో చూపెట్టాలని, ప్రతి ఒక్కరూ ఇంటిలో మొక్కను కచ్చితంగా నాటాలని తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి మాట్లాడుతూ జీవవైవిద్యాన్ని కాపాడుకుందాం... భవిష్యత్తు తరాలకు భద్రతనిద్దాం అని తెలుపుతూ గతంలో పర్యావరణ పరిరక్షణకు నగరంలో సైకిల్ యాత్రను నిర్వహించి పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేశానని తెలిపారు. 

పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అసిస్టెంట్ మానస గారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, వ్యర్ధాలను సరైన విధంగా నిర్వహించాలని తెలిపారు. 

జిల్లా సైన్స్ అధికారి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రతిజ్ఞ మరియు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని కొనియాడారు. అనంతరం అందరూ కలిసి బాల్ భవన్ ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ అశోక్ గారికి పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి శ్రీ గంగా కిషన్ గారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏఈ మానస గారు, బాల్ భవన్ సూపర్డెంట్ ఉమా, ప్రభాకర్ సార్ గారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిబ్బంది వరలక్ష్మి, గోవర్ధన్ మరియు ఎస్ టి యు ప్రతినిధి శ్రీకాంత్ గారు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.komuraiahramadugu12@gmail.com

 

komuraiahramadugu12@gmail.com

రామడుగు కొమురయ్య ఎడిటర్

నేటి ఇజం దినపత్రిక

Post a Comment

0 Comments