అర్జునగుట్టలో పోలీసుల దాడి: గుడుంబా స్వాధీనం, ముగ్గురిపై కేసు నమోదు



 అర్జునగుట్టలో పోలీసుల  దాడి: గుడుంబా స్వాధీనం, ముగ్గురిపై కేసు నమోదు

చెన్నూర్/అర్జున గుట్ట: నేటి ఇజం: 02/03/2026

గ్రామాల్లో ప్రభుత్వ నిషేధిత గుడుంబా కి తావులేకుండా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా కోటపల్లి పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. కోటపల్లి ఎస్సై రాజశేఖర్ కి అందిన నమ్మదగిన సమాచారం మేరకు సోమవారం అర్జునగుట్ట గ్రామంలోని పలు అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిల్వ ఉంచిన ప్రభుత్వ నిషేధిత గుడుంబాను మరియు తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల వివరాలు:

తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు:

 * ఆకుదారి అనిల్ (20): ఇతని వద్ద నుండి 10 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 300 లీటర్ల బెల్లపు పానకాన్ని పోలీసులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు.

 * అట్టేలా మల్లయ్య (62): ఇతని వద్ద నుండి 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.

 * ఆకుదారి సదువలి (40): ఈమె వద్ద నుండి 10 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.

*శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం:*

ఈ సందర్భంగా ఎస్సై రాజశేఖర్  మాట్లాడుతూ.. గ్రామాల్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గుడుంబా వల్ల ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి అక్రమ తయారీదారులపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.

ఈ ఆపరేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ బుజ్జి బాబు, TGSP కానిస్టేబుల్స్ మల్లేష్, సాయి కృష్ణ, మరియు నరేష్ లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments