*మరో బస్సు ప్రమాదం.....ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 10 మందికి గాయాలు!*
నేటి ఇజం: యాదాద్రి భువనగిరి జిల్లా: 03/03/2026
యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.
ఏపీ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న నిడదవోలు ఆర్టీసీ బస్సు రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.


0 Comments