ప్రజాస్వామ్యం, న్యాయాన్ని కాపాడుకోవాడని ఇంకా ఎన్ని అక్రమ కేసులనైనా బీ ఆర్ ఎస్ సిద్ధమే..
తేదీ: మార్చి 4, 2026 : నేటి ఇజం:
మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ జైలు నుంచి విడుదలపై నస్పూర్ బీఆర్ఎస్ పార్టీ సంతోషo వ్యక్తం చేస్తున్నది .
మాజీ ఎమ్మెల్యే, చెన్నూరు నియోజకవర్గం మాజీ ప్రతినిధి, మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ బాల్క సుమన్ గారికి మంచిర్యాల జిల్లా సెషన్స్ కోర్టు (మార్చి 2, 2026న) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత ఫిబ్రవరి 18న క్యాతన్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలకు సంబంధించి అరెస్టు చేయబడి, 14 రోజులుగా ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయన నేడు (మార్చి 4, 2026) ఉదయం బెయిల్ పత్రాలు పూర్తయిన తర్వాత జైలు నుంచి ఉదయం విడుదల అయ్యారు .
ఈ క్రింది షరతులతో..
కోర్టు మంజూరు చేసిన బెయిల్ షరతులు:₹25,000 బాండ్ మరియు ఇద్దరు సురేటీలు.
వారానికి ఒకసారి (ఆదివారం) రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలి.
ఈ ఘటనలో బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్ గారిపై పెట్టిన కేసు పూర్తిగా రాజకీయ ప్రేరితమైనది, అక్రమమైనది, ప్రజాస్వామ్య వ్యతిరేకమైనదని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో అన్యాయాలు, బలప్రయోగం చేసి ఓటమిని అంగీకరించకుండా, ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి హింసాత్మకంగా వ్యవహరించిన, న్యాయవ్యవస్థ ఈ అక్రమాన్ని గుర్తించి బెయిల్ మంజూరు చేయడం సంతోషకరం.బీఆర్ఎస్ పార్టీ తరపున బాల్క సుమన్ గారి విడుదలను స్వాగతిస్తున్నాము. ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, చెన్నూరు-మంచిర్యాల ప్రజలు ఈ విడుదలతో సంబరాలు చేపడుతున్నారు. ఆయన మధ్యానం మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి తర్వాత తన నివాసానికి చేరుకుని ప్రజాసేవలో మరింత ఉత్సాహంగా కొనసాగుతారని ఆశిస్తున్నాం.ఈ అక్రమాలకు, రాజకీయ ప్రతీకారాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ బలమైన పోరాటం కొనసాగిస్తుంది. ప్రజాస్వామ్యం, న్యాయం కాపాడుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉంది.
komuraiahramadugu12@gmail.com
రామడుగు కొమరయ్య సీఈఓ






0 Comments