*ఓదెల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని..*
*ఓదెల మల్లన్నకు కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకున్న...*
పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు
ఓదెల: నేటి ఇజం: 01/03/2026
ఓదెల శ్రీ.మల్లికార్జున స్వామి వారిని ఆదివారం రోజున పావని దంపతులు కుటుంబ మరియు సపరివార సమేతంగా తమ ఇంటి ఇలవేల్పు అయిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి మొక్కులు చెల్లించుకున్న పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణా రావు
ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు..
తదుపరి బోనాలు సమర్పించుకొని ,పట్నాలు వేసి స్వామివారిని కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే విజయరమణా రావు కొలిచారు...
అనంతరం ఆలయ కమిటీ పక్షాన మెమొంటోలు స్వామివారి కండువాలతో ఎమ్మెల్యే విజయరమణా రావు గారిని వారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చీకట్ల మొండయ్య, ఈవో సదయ్య, ఆలయ కమిటీ డైరెక్టర్లు మరియు పలు గ్రామాల సర్పంచులు, ఆలయ అర్చకులు మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
komuraiahramadugu12@gmail.com
నేటి ఇజం : రామడుగు కొమురయ్య సీఈఓ






0 Comments