మంథని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు
నేటి ఇజం: మంతిని: 7:2:2026:
మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచిరాజ్‌పల్లిలో ఈ రోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు గారు బలపరిచిన 5వ వార్డు అభ్యర్థి ముస్కుల సయేందర్ రెడ్డి గారిని చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూచిరాజ్‌పల్లి ప్రజలను కోరారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం,అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని,మంథని పట్టణ అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.


0 Comments