బైకు జారిపడి వెనకాల కూర్చున్న మహిళ మృతి మహిళ మృతి .



 *బైక్ జారిపడి వెనుకాల కూర్చున్న మహిళ మృతి*

నేటి ఇజం, జైపూర్, ఫిబ్రవరి 07


 మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామ శివారులోని  చిన్నవాగు బ్రిడ్జిని కలిపే అప్రోచ్ రోడ్డు సరిగా లేక బైక్ జారిపడి వెనకాల కూర్చున్న మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన శుక్రవారం కలకలం రేపింది.మంథనికి చెందిన పాపిట్ల రజిని తలకు తీవ్ర గాయాలై అధిక రక్త శ్రావం కాగా అక్కడికక్కడే మరణించిందని స్థానికులు తెలిపారు.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు వారికి సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని ఎస్సై రాజశేఖర్ తెలిపారు.భర్త విజయ్ భాస్కర్ తో మంచిర్యాల వైపు వెళుతుండగా ప్రమాదం చోటు చేస్తుందని మృతురాలు బంధువులు తెలిపారు. ఈ విషాద ఘటనతో బ్రిడ్జిపై నుండి ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు హడలిపోతున్నారు.

Post a Comment

0 Comments