నేటి ఇజం: శ్రీరాంపూర్
శ్రీరాంపూర్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి 6వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మేకల అశ్విని- దాసు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి మరియు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి, కలవేన శంకర్ మాట్లాడుతూ దాసు మీవాడు మీ అందరివాడు దాసు చేసిన పనులు నాకంటే ఎక్కువ మీకే తెలుసు పిల్లగాడు చిన్ననాటి నుండే క్రమశిక్షణతో పెరిగిన విద్యార్థి నాయకుడి నుండి ప్రజా నాయకుడు దాకా ఎదగడానికి కారణం ఇక్కడ ఉన్న ఆరో డివిజన్ ప్రజలే మీ వల్లే దాస్ కి పేరు వచ్చింది ఆ పేరు వలెనే గత ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేస్తే మీరే గెలిపించారు,గెలిపించిన దానికి దాసు ఎన్నో అభివృద్ధి పనులు ఇక్కడ చేశాడు, క్రీడా ప్రాగణం, ఓపెన్ జిమ్ అన్ని వార్డులలో రోడ్లు వేయించాడు, మరియు డ్రైనేజీ మురికి కాలువలు కట్టించాడు, మరోసారి అవకాశం ఇవ్వండి..6వ డివిజన్ కార్పొరేటర్ గా మీరు గెలిపియండి ఇక్కడున్న ప్రతి సమస్యను దాసు పరిష్కరిస్తాడు. దాసు తరుపున నేను కూడా హామీ ఇస్తున్నాన మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్ రెడ్డి అన్నారు, ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి జోగుల మల్లయ్య కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మారుమల్లయ్య కాంగ్రెస్ నాయకులు కిషన్ సహాయ కార్యదర్శి లింగం రవి ఎఐటియుసి శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా శ్రీరాంపూర్ శాఖ కార్యదర్శి పూజారి రామన్న సహయ కార్యదర్శి కొత్తపల్లి మహేష్ సోషల్ మీడియా ఇంచార్జ్ రాజకుమార్ సంపత్, సాయి నవీన్ తదితరులు పాల్గొన్నారు



0 Comments