ఆరవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా వనపర్తి కేత రాజేష్ విజయకేతనంలో దూసుకెళ్తున్న అభ్యర్థి
నేటి ఇజం: 6:2:2026: శ్రీరాంపూర్
నన్ను గెలిపించినట్లయితే నిస్వార్థంగా, నిజాయితీగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేస్తాను . 24 గంటలు 365 రోజులు మీకు అందుబాటులో ఉంటాను. మీకు కష్టం వస్తే మీ ఇంటి పెద్ద కొడుకునై పనిచేస్తా. నేను గెలిచినట్లయితే నాకు ప్రభుత్వం నుంచి వచ్చే గౌరవ వేతనాన్ని కూడా ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తాను. నీటి ఎద్దడి సమస్య పరిష్కరించి స్వచ్ఛమైన నీరు అందించడం ప్రజల ఆరోగ్యాల సమస్యలపై మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఇండ్ల పట్టాలు రాని వారికి పట్టాలి ఇప్పించడం ఆడపిల్ల జన్మిస్తే చిన్నారి తల్లి కానుకగా 5000 సొంత రూపాయలు అందించడం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటుకు కృషి చేయడం డివిజన్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం ఆర్కే సిక్స్ కొత్త రోడ్డు పోచమ్మ గుడి నుండి శ్రీరాంపూర్ బస్టాండ్ వరకు రోడ్డు వెడల్పు మరియు నిర్మాణ పనులు చేపట్టడం ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతి యువకులకు గ్రంథాలయం ఏర్పాటు నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాల కొరకు జాబ్ మేళాలు నిర్వహించడం నిరుపేద కుటుంబంలో ఆడబిడ్డ పెళ్ళికానుకగా 5000 రూపాయలు సొంత ఖర్చులతో అందించడం సింగరేణి సేఫ్ నిధులు డివిజన్ పరిధిలో ఖర్చు చేసి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని హామీ ఇస్తున్నాను ప్రజలు తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించగలరని కోరుచున్నాను


0 Comments