మంచిర్యాల జిల్లా ఆరవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా తరారి శ్రీలత రాజు ముమ్మర ప్రచారం

మంచిర్యాల జిల్లాలో ఆరవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా
 తలారి శ్రీలత రాజు ముమ్మర ప్రచారం

నేడి ఇజం: 2:2:2026: శ్రీరాంపూర్

నన్ను గెలిపించినట్లయితే నిస్వార్థంగా, నిజాయితీగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేస్తాను . 24 గంటలు 365 రోజులు మీకు అందుబాటులో ఉంటాను. మీకు కష్టం వస్తే మీ ఇంటి పెద్ద కొడుకునై పనిచేస్తా. నేను గెలిచినట్లయితే నాకు ప్రభుత్వం నుంచి వచ్చే గౌరవ వేతనాన్ని కూడా ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తాను..

1. మన డివిజన్ పరిధిలోని కస్తూరిబా, గురుకుల బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ స్కూల్, మోడల్ స్కూల్  మరియు సింగరేణి పాఠశాల లో చదువుతున్నటువంటి  పదవ తరగతి విద్యార్థులకు మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు నేను పదవిలో ఉన్నంతవరకు పరీక్ష ఫీజులను పూర్తిగా నేనే చెల్లిస్తాను. 

2. నీట్, గేట్ మరియు సివిల్స్ కు క్వాలిఫై అయినా విద్యార్థులకు వారి ఉన్నత చదువుల కొరకు ఆర్ధిక తోడ్పాటును అందిస్తాను.

3. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు ప్రిపేరవుతున్నటువంటి నిరుద్యోగులకు శాశ్వత ప్రతిపాదికన లైబ్రరీ ఏర్పాటు చేస్తాను.

4. ఏ మున్సిపాలిటీ వార్డులో ఉన్నటువంటి చేతి వృత్తుదారులకు,స్వయం ఉపాధిదారులకు కష్టపడి పని చేసే వారికి లేబర్ కార్డు మరియు ఉద్యోగ ఆధార్ లాంటి ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డ్స్ ను అందిస్తాను.

5. ప్రైవేటు ఉద్యోగులకు మరియు చేతి వృత్తిదారులకు వ్యక్తిగత ప్రమాద బీమా, ఐదు లక్షల వరకు, ఐదు సంవత్సరాల గాను నేనే చెల్లిస్తాను. 

6. మన కార్పొరేషన్ పరిధిలోనీ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారి కుటుంబంలో ఒక ఆడబిడ్డకు పెళ్లి జరిగితే, నా స్వంత డబ్బులు 5016లను నేనే స్వయంగా అందిస్తాను.

8. నా డివిజన్ పరిధిలో ఎవరైనా మరణించినట్లయితే వారి కుటుంబానికి  భరోసా కింద నా వంతుగా 5016 లు మరియు 50 కేజీల సన్నబియ్యాన్ని అందిస్తాను. 

9. సంవత్సరానికి రెండు సార్లు మన ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ పూర్తి ఉచితంగా హెల్త్ చెకప్, కంటి, ఆరోగ్య పరీక్షలు చేయిస్తాను.

10. డ్రైనేజ్, మరియు నీటి సమస్యను పూర్తిగా తొలగిస్తాను. అవసరమైన చోట నీటి సమస్యను తీర్చడానికి బోర్లు వేపిస్తాను.

11. రోడ్డు వ్యవస్థను ఆధునీకరించి, రోడ్ డివైడర్, ఇంకుడు గుంతలు నిర్మిస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రీట్ లైట్ వ్యవస్థను మారుస్తూ మరింత మెరుగైనటువంటి స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేస్తాను.

12. మన ప్రాంతం లో ఉన్న వృద్ధులు, వికలాంగు


లు, వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్లు ఇప్పిస్తాను మరియు నూతన రేషన్ కార్డులు ఇప్పిస్తాను.

13. మన ప్రాంతానికి వచ్చే సింగరేణి CSR మరియు DMFT నిధులను కచ్చితంగా మన ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేసే విధంగా పోరాడాతాను.

14. మన ప్రాంతం లో పిల్లలకు ఫోన్ వ్యసనాల నుంచి దూరం చెయ్యడానికి పార్క్ లేదా క్రీడ స్థలాన్ని ఏర్పాటు అయ్యేలా కృషి చేస్తాను.

15. నిరుద్యోగ యువతీ , యువకులకు, skill development programmes ఏర్పాటు చేసి, వారికి లోకల్  ప్రైవేట్ కంపెనీల చేత ఉద్యోగాలు వచ్చే విధంగా జాబ్ మేళా నిర్వహిస్తాను.

నిజాయితీగా ఓటు వెయ్యండి, అభివృద్ధికి బాటవెయ్యండి.

Post a Comment

0 Comments